Site icon TeluguMirchi.com

ఈ నెల 23 నుంచి పవన్ – త్రివిక్రమ్ సినిమా

Pavan Kalyan Trivikram Film Toofanపవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ – త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా షూటింగ్ ఈ నెల 23 నుంచి మొదలుకాబోతోంది. త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగా కాకుండా ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అటు దర్శకుడు, ఇటు హీరో పవన్ కూడా పట్టుదలతో వున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటి లో ప్రత్యేకించి ఓ భారీ సెట్ కూడా నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ తో బాటు స్పెయిన్ లో జరుగనున్నట్టు నిర్మాణ వర్గాలు తెలిపాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని మూడు నెలల కాలంలో పూర్తి చేసి రానున్న మే నెలలో విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఇప్పటివరకు ఎన్నెన్నో ఊహాగానాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘ తుఫాన్ ‘ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటినుంచే అటు ఫ్యాన్స్ లోనూ ఇటు పరిశ్రమలోనూ ఎదురుచూపులు మొదలయ్యాయి.

Exit mobile version