జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ పై ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీనికి కారణం వైకాపా తమ అభ్యుర్థులతో వెయ్యి రూపాయిలు పంచడం. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని వైకాపా అభ్యర్థులతో పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని పవన్ సూచించారు
పేద ప్రజలకు అండగా నిలుద్దాం… కరోనా నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సూచనలు పాటిద్దాం పవన్ మరోసారి పిలుపునిచ్చారు. ‘‘కరోనా వైరస్ విస్తృతి ఉన్న విపత్కర తరుణం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు.. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం’ అని ఆయన చెప్పుకొచ్చారు