Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ దేవుడి కంటే గొప్పోడు !

pavan4ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏంటి..?? ఇంత ప‌ని చేశాడు..??
బ‌హుశా రేణూ దేశాయ్ కూడా ఇంత బాధ‌ప‌డిపోయి ఉండ‌దు. ప‌వ‌న్ మూడో పెళ్లి విష‌యం తెలియ‌గానే ప‌వ‌న్ అభిమానులు మాత్రం ఇలాగే తెగ ఫీలైపోయి, ఫూలైపోయి ఉంటారు. రెండో పెళ్లి, మూడో పెళ్లి అనేవి సినిమా వాళ్లకు కొత్తేం కాక‌పోవ‌చ్చు. కానీ ప‌వ‌న్ లాంటి వాడు… ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకొని తీన్ మార్ ఆడేస్తుంటే, ఆయ‌న్ని దేవుడిలా కొలుస్తున్నవాళ్లంతా డ‌ల్ అయిపోయారు. (దేవుళ్లకూ కూడా ఇద్దరు పెళ్లాలే, మా ప‌వ‌న్‌కి మాత్రం మూడో పెళ్లాం ఉంది… కాబ‌ట్టి ఆ దేవుడి కంటే ప‌వ‌నే ఎక్కువ అనే కొత్త పాయింట్ లాగినా లొగొచ్చు..).

పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగ‌త విష‌యం. ఇలా ఎందుకు చేశావ్‌..?? అని ప‌వ‌న్‌ని ఎవ‌రూ నిల‌దీసి అడ‌గ‌లేరు. అది మ‌న స‌భ్యత కాదు.

కానీ ప‌వ‌న్ స‌భ్యత ఏమైంది?? ప‌వ‌న్ ఇప్పుడు సోలో కాదు. ఆ మాట‌కొస్తే ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ. ప‌వ‌న్ స్టైల్, మాట‌, న‌డ‌క‌, న‌డ‌త అనుస‌రించే అభిమానులు కోకొల్లలు. దానికి ప‌వ‌నిజం పేరు పెట్టి.. ఓ కొత్తయిజాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ప‌వ‌న్‌ని ఇంచుమించుగా దైవాంశ‌సంభూతుడుగానే చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వ‌ప‌న్ ఇలాంటి త‌ప్పట‌డుగు ఎందుకేశాడ‌నేది.. అభిమానుల‌కు సైతం అర్థం కాని విష‌యం. పైగా అంత ర‌హ‌స్యంగా, గుట్టు చ‌ప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవ‌ల‌సిన అగ‌త్యం ఎందుకొచ్చింది..?? నేను మ‌హిళ‌ల్ని ఉద్దరించ‌డానికే ఉన్నా – అని గొప్పలు చెప్పుకోవ‌డానికైనా అభిమానుల స‌మ‌క్షంలో చేసుకొంటే… ప‌వ‌న్ ఇమేజ్ నిజంగానే ఇంకో మెట్టు పైకి ఎక్కుదును. కానీ ఇక్కడ అలా జ‌ర‌గ‌లేదు. అన్నిటా ర‌హ‌స్యమే. మీడియాలో ఇంత రాద్దాంతం జ‌రుగుతున్నా ప‌వ‌న్ ఇప్పటికి ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు. ప‌వ‌న్‌కి అమ్మాయిల మీద‌, వివాహ వ్యవ‌స్థమీద ఉన్న న‌మ్మకానికి ఈ మూడు పెళ్లిళ్లూ నిద‌ర్శనం అని ఇప్పటికే నాన్ ప‌వ‌న్ ఫ్యాన్స్… ప‌వ‌న్‌పై బుర‌ద (నిజ‌మే క‌దా…) చ‌ల్లడానికి ప్రయ‌త్నిస్తున్నారు.

ప‌వ‌న్ ని కోట్లాదిమంది అభిమానిస్తున్నారు, అనుక‌రిస్తున్నారు. మా కోసం ఏదో చేస్తాడులే అనుకొంటున్నారు. త‌న కోసం పెళ్లిళ్లమీద పెళ్లిళ్లుచేసుకొంటార‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ప‌వ‌న్‌ని రాజ‌కీయాల్లోకి ర‌మ్మని, రావ‌ల్సిందేన‌ని.. అభిమానుల ఆశ‌, ఆకాంక్ష‌. అదిగో వ‌స్తున్నాడు, ఇడిగో వ‌స్తున్నాడు అంటూ మీడియా కూడా టాం టాం చేస్తోంది. ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు అనే ట్యాగ్ లైన్‌తో ప‌వ‌న్ బ‌య‌ట‌కు రాగ‌ల‌డా..?? నాకు ఓటేయండి అంటూ అడ‌గ్గల‌డా..?? సెల‌బ్రెటీలు కొంతమేర వ్యక్తిగ‌త జీవితాన్ని ప‌ణంగా పెట్టాల్సిందే. ఎందుకంటే ఓ సెట‌బ్రెటీ త‌ప్పు చేస్తే… ఆ ప్రభావం, దానికొచ్చే ప్రచారం వేరు. స‌మాజానికి అది త‌ప్పుడు సంకేతాలు అందిస్తుంది. ప‌వ‌న్ కి ఈ భ‌యం కూడా లేక‌పోయింది. ప్చ్‌.. ఏం చేస్తాం..??? ప‌వ‌న్‌ని అభిమానిస్తూ ఇలాగే ముందుకు సాగిపోదాం. రేప‌టి ప‌వ‌న్ సినిమాకి థియేట‌ర్ల ముందు ప‌వ‌న్ ఫ్లెక్సీలు మాత్రమే కాదు.. ఆయ‌న ముగ్గురు పెళ్లాల ఫొటోల‌కూ పాలాభిషేకం చేద్దాం. ఎందుకంటే ప‌వ‌న్ త‌ప్పు చేసినా, దాన్ని సూప‌ర్ హిట్ చేసేంత అభిమానం మ‌న‌ది. జై ప‌వ‌న్ క‌ల్యాణ్‌… జైజై ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Exit mobile version