జానీ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు పవన్ కల్యాణ్. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవం అలాంటిది. అప్పటి వరకూ దిగ్విజయంగా సాగిపోతున్న పవన్ కెరీర్ కి స్పీడు బ్రేకర్లు వేసిన చిత్రమది. పంపిణీదారులను కూడా నిలువెల్లా ముంచేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన మనసు మెగాఫోన్ పై పడింది. త్వరలోనే మళ్లీ… స్టార్ట్ యాక్షన్ చెప్పడానికి సమాయాత్తం అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. పవన్ స్టామినా చూపించిన చిత్రం గబ్బర్ సింగ్. దీనికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. గబ్బర్ సింగ్ 2 పేరుతో ఈ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు పవన్. దీనికి ఆయనే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కథ సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే గబ్బర్ సింగ్ 2కి సంబంధించిన విశేషాలు తెలుస్తాయి.