Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ ప్రసంశే అవార్డు

samantha bollywood entryన‌టిగానే కాదు, స‌మాజంపై బాధ్యత ఉన్న అమ్మాయిగానూ స‌మంత అంద‌రికీ న‌చ్చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. అత్తారింటికి దారేది స‌క్సెస్ మీట్‌లో సమంత‌ని ఆయ‌న ఆకాశానికి ఎత్తేశారు. స‌మంత‌లోని మంచిత‌నం త‌న‌ని క‌ద‌ల్చివేసింద‌ని చెప్పారు. ఈ మాట‌ల‌కు స‌మంత తెగ సంబ‌ర ప‌డిపోతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నా అభిమాన న‌టుడు. ఆయ‌న వ్యక్తిత్వం ముందు నేనెంత‌..? అలాంటి మంచి మ‌నిషి నా గురించి నాలుగు మంచి మాట‌లు చెబుతుంటే.. చాలా గ‌ర్వంగా అనిపించింది. నిజానికి అంత‌కంటే గొప్ప అవార్డు ఉంటుంద‌నుకోను. నా ఫేవ‌రెట్ కోస్టార్ ఆయ‌న‌. ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ మ‌ర్చిపోలేను..స‌స‌ అంటోంది స‌మంత‌.

Exit mobile version