పవన్ కోసం వస్తున్నారు

Pavan Kalyanపవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘అత్తారింటికి దారేది’. సమంత, ప్రణీతలు హీరోయిన్స్. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఓ పార్టీ సాంగ్ ను అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోస్ లో షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ ను పవన్, మిర్చి ఐటెం హంసానందిని పై చిత్రీకరిస్తున్నారు. పవన్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ కు కొరియోగ్రఫర్ గా చేసిన గణేష్ మాస్టర్ ఈ పార్టీ సాంగ్ కు నృత్యభంగిమలు సమకూరుస్తున్నారు. దేవిశ్రీ ఈ సాంగ్ ఇచ్చిన ట్యూన్ అదిరిపొయిందట. గబ్బర్ సింగ్, జల్సా టైటిల్ సాంగ్స్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఆల్బం లో హైలెట్ గా నిలవనుందని యూనిట్ భావిస్తోంది. కాగా ఈ పాట షూటింగ్ స్పాట్ లో పవన్ ను చూడ్డానికి ఇండస్ట్రీ నుంచి చాలా మంది నటులు, నిర్మాతలు వస్తున్నారు. షూటింగ్ దగ్గర అంతా పండగ వాతావరణం నెలకొంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ను ఆగస్ట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 14న ఆడియో విడుదల చేస్తారు.