పవన్ మూవీ టైటిల్ ఖరారైంది!

pavan and trivikramపవన్, త్రివిక్రమ్ ల సినిమా టైటిల్ ఖరారైంది అయింది. చిత్ర నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్నటివరకు వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ పేరునే (అత్తారింటికి దారేది) తమ చిత్రానికి ఖరారు చేసినట్టు నిర్మాత తెలిపారు. అలాగే, ఆగస్టు 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశ కు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో చివరి పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియో లో జరుగుతోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల‌ను ఈనెల 14న విడుద‌ల చేస్తారు.