Site icon TeluguMirchi.com

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మిలియ‌నీర్‌!!

pavanఅత్తారింటికి దారేది సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? అత‌ను ఏం చేస్తాడు?? – ఇందుకు సంబంధించిన ఓ క్లూ దొరికింది. ఈ సినిమాలో ప‌వ‌న్ న‌దియా ఇంట్లో డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తాడ‌ట‌. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో ఓ మిలియ‌నీర్ అట‌. మ‌రి అన్ని కోట్లుండి ఓ డ్రైవ‌ర్‌గా ఎందుకు ప‌నిచేయాల్సి వ‌చ్చింది? అస‌లు న‌దియా ఇంటికే ఎందుకొచ్చాడ‌ను అనేదే ఈ సినిమా క‌థ‌.

విదేశాల్లో ఉన్నప‌వ‌న్‌… ఇండియాలో త‌న‌కు ఓ అత్తమ్మ ఉంద‌ని, ఆ కుటుంబంతో ఎన్నో యేళ్లుగా విబేధాలున్నాయ‌ని తెలుస్తుంది. తాత‌య్య బొమ‌న్ ఇరానీ ద‌గ్గర అనుమ‌తి తీసుకొని అత్తారింటికి దారేది అంటూ వెతుక్కొంటూ ఇండియా వ‌స్తాడు. ఇక్కడ స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇంత‌కీ స‌మంత ఎవ‌రో కాదు.. అత్తమ్మ కూతురే. అందుకే ఆ ఇంట్లో డ్రైవ‌ర్‌గా చేర‌తాడు. మ‌రి అత్తమ్మని ఎలా దారిలోకి తీసుకొచ్చాడు అనేదే ఆస‌క్తిక‌రం. స్టోరీ లైన్ కాస్త రొటీన్‌గానే ఉన్నా.. తీస్తోంది త్రివిక్రమ్‌, చేస్తోంది ప‌వ‌న్ క‌దా.. త‌ప్పకుండా అద‌ర‌గొట్టేసే ఉంటారు. ఈసినిమా ఎంత అదిరిపోతుందో.. తెర‌పై చూడాల్సిందే.

Exit mobile version