అత్తా పూర్ బాబాగా పవన్

pavanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘అత్తారింటికి దారేది. త్రివిక్రమ్… బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్స్, కామెడీ హైలెట్స్ గా నిలవనున్నాయి. ఈ చిత్రానికి సంభందిచి ఇప్పటికే… ‘నీలాంటి వాడు స్ట్రీట్ కి ఒకడు వుంటాడు. నాలాంటి వాడు స్టేట్ కి ఒకడు వుంటాడు‘.. లాంటి డైలాగ్స్ నెట్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో పవన్ బాబా గెట్అఫ్ ఒకటి హాల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ అత్తాపూర్ బాబాగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ లో కామెడి అదిరిపొయిందట. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ లానే ‘పవన్ అత్తా పూర్ బాబా’ ఎపిసోడ్ మూవీ హైలెట్ కానుందని యూనిట్ చెబుతోంది. ఇక ఈచిత్రాన్ని ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అందిచిన ఈ చిత్రం ఆడియో ను జూలై 14న విడుదల చేస్తారు.