జానీ.. ఫ్లాప్ అని ఒప్పుకొన్నాడు!

pavanత‌మ సినిమా ఫ్లాప్ అంటే ఏ హీరో ఒప్పుకోడు. `ప్రేక్షకుల‌కు చూడ‌డం రాదు…` అనేస్తారు. కానీ ప‌వ‌న్ కల్యాణ్ అలా కాదు. వేల మంది అభిమాన గ‌ణం ముందు, టీవీ ఛాన‌ళ్ల లైవ్ న‌డుస్తుండ‌గా – ”జానీ సినిమా ఫ్లాప్‌” అని ఒప్పుకొన్నాడు! అత్తారింటికి దారేది ఆడియో వేడుక‌లో ప‌వ‌న్ మ‌న‌సు పిప్పి మాట్లాడాడు. ఈ సంద‌ర్భంలోనే జానీ ప్రస్తావ‌న వ‌చ్చింది. ”నా డైరెక్షన్‌లో వ‌చ్చిన జానీ ఫ్లాప్ అయిన త‌ర‌వాత‌..” అంటూ ఏదో చెప్పబోతుంటే ఫ్యాన్స్ గోల చేశారు. హిట్ హిట్ అంటూ స‌ర్దిచెప్పబోయారు. కానీ ప‌వ‌న్ నిజాయ‌తీగా మాట్లాడ‌డం అభిమానుల‌కూ న‌చ్చింది. ద‌టీజ్ ప‌వ‌ర్ స్టార్ అంటూ… త‌న హీరోని మరోసారి ఆకాశానికి ఎత్తేశారు.