రజనీ తో పట్టపగలు !

rajanikanth
సినిమాల ప్రమోషన్ కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు మన దర్శక నిర్మాతలు. ఓ పెద్ద సినిమాల విడుదలతో బాటుగా కొందరు తమ సినిమాల ట్రైలర్లను ధియేటర్లలో ప్రదర్శించే ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు రాజశేఖర్ హీరోగా రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘పట్టపగలు’ సినిమా ట్రైలర్లను ఓ క్రేజీ చిత్రం తో పాటే ప్రదర్శించడానికి ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘విక్రమసింహా’ (కొచ్చాడియాన్) సినిమాతో బాటుగా ‘పట్టపగలు’ ప్రదర్శించనున్నారు. మరి, రజనీకాంత్ చిత్రానికి తెలుగు కూడా భారీ ఓపెనింగ్స్ వుంటాయి. అందుకే, ఈ సినిమాతో పట్టపగలు ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. ఈ శుక్రవారం రజనీ థియేటర్ లోకి వస్తున్నాడు.