1000 కోట్లు దాటిన ‘పఠాన్’ కలెక్షన్స్..


బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫఠాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సత్తా చాటింది. విడుదలకు ముందే ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఈ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రిలీజైన ఐదు రోజులకే 550 కోట్లు వసూల్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం రూ.వెయ్యి కోట్ల మార్క్‌ను దాటింది. షారుఖ్ కెరీర్‌లోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మొదటి చిత్రంగా పఠాన్ నిలిచింది. రూ.1000 కోట్ల కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది.

ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ గా కనిపించాడు. ఇక బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకు రావడానికి.. కొన్ని రోజులు వరకు మరో పెద్ద మూవీ రిలీజ్ కాకుండా చూసుకున్నారు. అంతేకాదు టికెట్ రేట్లు తగ్గిస్తూ ఆఫర్ అనౌన్స్ చేసి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఏదేమైనా ఈ ప్రయత్నాలు అన్ని ఫలించాయి. ఎట్టకేలకు ఈ మూవీ 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.