Site icon TeluguMirchi.com

సూర్య కు విలన్ ఇతడే..

గత కొంతకాలంగా సరైన హిట్ లేని సూర్య..ప్రస్తుతం ఆశలన్నీ ‘కాప్పాన్‌’ పైనే పెట్టుకున్నాడు. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే గురు ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరైపోట్రు’ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ మూవీ కి భారీ కాస్టింగ్ క్రూ పనిచేస్తున్నారు. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా ఈ సినిమాలో విలన్ రోల్ కు గాను పరేష్‌ రావల్‌ ఎంపిక చేసారు. 1980ల్లో బాలీవుడ్‌ వెండితెరకు పరిచయమైన పరేష్‌ రావల్‌ ఈ చిత్రం ద్వారా తమిళ వెండితెరపై అడుగుపెట్టనున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా’ చిత్రంలో డాక్టర్‌ ‘లింగం మావయ్య’గా అందర్నీ నవ్వించాడు.

Exit mobile version