Site icon TeluguMirchi.com

ప్రభాస్ లిస్ట్ లో పరిణీతి చోప్రా..

ప్రభాస్ – సుజిత్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ ఈ మూవీ లో హీరోయిన్స్ లిస్ట్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. భారీ బడ్జెట్ తో హిందీ , తెలుగు , తమిళ్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కబోతుండడం తో ప్రభాస్ కు జోడి హీరోయిన్ కోసం ఇంకా వేట కొనసాగిస్తూనే ఉన్నారు.

మొదటగా తమన్నా అనుకోకగా ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఈ లిస్ట్ లో వచ్చేసారు..కత్రినా , శ్రద్ధ కపూర్ , పూజ హెగ్డే, దీపికా పాడుకొనే పేర్లు వినిపించగా తాజాగా ఈ లిస్ట్ లో పరిణితి చోప్రా జాయిన్ అయ్యింది. సాహో నిర్మాతలు ఈమెను కూడా అడిగారని తెలుస్తుంది. మరి ఈ ఆఫర్ ఫై పరిణితి ఏమున్నదో తెలియదు కానీ ప్రభాస్ పక్కన నటించేందుకు రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈమె పేరు కూడా ప్రచారం తోనే సరిపెడతారా లేక హీరోయిన్ గా ఖరారు చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version