31న మంచు ఫ్యామిలీ సినిమా

pandavulu pandavulu tummedaమెహ‌న్‌ బాబు ఇంటి నుంచి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తోంది. అదే… ‘పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌’. మోహ‌న్‌ బాబు విష్ణు, మ‌నోజ్‌, వ‌రుణ్ సందేశ్‌, త‌నీష్ క‌థానాయ‌కులు. శ్రీ‌వాస్ దర్శకుడు. చిత్రీక‌ర‌ణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంత‌ర కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31న తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అదే రోజున ‘ఆటోన‌గ‌ర్ సూర్య‌’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధమ‌య్యాయి. మ‌రి…. మంచు ఫ్యామిలీ ఆ సినిమాల‌తో ఏ విధంగా త‌ల‌ప‌డుతుందో చూడాలి. ఈ చిత్రానికి న‌లుగురు సంగీత ద‌ర్శకులు స్వరాలు అందించ‌డం విశేషం. అంతేకాదు.. మ‌నోజ్ ఆడ‌వేషంలోనూ అల‌రించ‌నున్నాడు.