మంచు ఫ్యామిలీ హీరోస్ మోహన్‌బాబు-మంచు విష్ణు-మంచు మనోజ్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. రవీనాఠాండన్-హన్సిక-ప్రణీత నాయికలు. వరుణ్‌సందేశ్-తనీష్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘లక్ష్యం’ ఫేం శ్రీవాస్ దర్శకుడు. కీరవాణి-బప్పి లహరి-మణిశర్మ-బాబా సెహగల్ సంయుక్తంగా సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ మొదటివారంలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరో వైపు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి అన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి.