ఫస్ట్ లుక్ : ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకునాడు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాకి డబ్బులు రాలేదు కానీ,మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఐతే ఈ మధ్య నితిన్ తో చేసిన ‘లై’ సినిమా మాత్రం నిరాశ పరిచింది.

అయితే హనుపై యువ హీరోలకు నమ్మకం వుంది. ఇప్పుడు శర్వానంద్‌ హనుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఓ రొమాంటిక్ టైటిలే అనుకుంటున్న‌ట్టు టాక్‌. ఈ చిత్రానికి ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ రోజు శర్వానంద్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టే ఈ ఫస్ట్ లుక్ కూడా క్లాస్ గా వుంది.