Site icon TeluguMirchi.com

చరణ్ 4 , మహేష్ 3

2018 అసలైన సినిమా సందడి ఇప్పుడు మొదలు అయ్యినట్లు తెలుస్తుంది. జనవరి లో పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ అవేవి కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. తాజాగా సమ్మర్ లో వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం , మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రాలు అసలైన సినిమా సందడి నీ తీసుకొచ్చాయి. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. రంగస్థలం విడుదలై మూడు వారాలు కావొస్తున్నా ఇంత టికెట్స్ దొరకని పరిస్థితి. అలాగే గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భరత్ అనే నేను చిత్రానికి సైతం మంచి టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుండడం తో డిస్ట్రబ్యూటర్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. మొదటి మూడు రోజుల్లోనే 2.32 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన రంగస్థలం, ప్రస్తుతం 3.44 డాలర్ల వద్ద ఉండి మూడున్నర మిలియన్ అందుకునే దిశగా నడుస్తుంది. అలాగే భరత్ అనే నేను మొదటి రోజు 1.36 మిలియన్ డాలర్లను అందుకొని , మూడు రోజుల్లోనే 2.48 మిలియన్ డాలర్లను రాబట్టి రెండున్నర మిలియన్లకు అతి చేరువలో ఉంది. మొత్తానికి ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తమ హవాను కొనసాగిస్తున్నాయి.

Exit mobile version