Site icon TeluguMirchi.com

ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు రివ్యూ

తెలుగు మిర్చి రేటింగ్ 2/5

చిన్న సినిమాలతో పెద్ద విజయాలు అందుకున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్ఢి. ఒకప్పుడు అగ్ర దర్శకుడాయన. ఎస్వికె సినిమా అంటే మినిమం గ్యారెంటీ. అయితేపదేళ్ళుగా ఆయన నుంచి సినిమానే రాలేదు. ఇప్పుడు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు తీశారు. బిగ్ బాస్ ఫేం సోహెల్ ఇందులో హీరో. మరో ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ ఎస్వీ కృష్ణారెడ్ఢి.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు వినోదాల్ని పంచారా ? మళ్ళీ ఫామ్ లోకి వచ్చారా ?

కథ: వెంకటరమణ (రాజేంద్రప్రసాద్‌) మాంచి పలుకుబడి వున్న పెద్ద మనిషి. తన వంద ఎకరాల భూమిలో ఆర్గానిక్ పద్దతిలో పంటలు పండిస్తుంటాడు. వెంకటరమణ భార్య శాకుంతుల(మీనా). వీరికి ఒక్కగాని ఒక్క కూతురు హాసిని (మృణాళిని రవి). కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునే వెంకటరమణ.. కూతురుకి కాబోయే భర్త కూడా తనలానే యోగ్యుడు సమర్ధుడు కావాలని ఆశపడతాడు. అయితే హాసిని మాత్రం విజయ్ (సోహెల్‌) ని ప్రేమిస్తుంది. విజయ్ రెండు ప్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు. మూడో సినిమా కోసం తిరుగుతుంటాడు. విజయ్ తల్లితండ్రులు కొండపల్లి బొమ్మలు అమ్ముకొని జీవితం సాగిస్తుంటారు. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న వెంకటరమణ ఏం చేశాడు ? విజయ్ కి ఇచ్చి పెళ్లి చేశాడా ? తన అంతస్తుతో అందుకోలేని వారితో వియ్యం అందుకున్నాడా అనేది మిగతా కథ.


విశ్లేషణ:
ఎస్వీ కృష్ణారెడ్ఢి కథలన్నీ సింప్లీ సూపర్. ఆయన కథలో అన్నీ ఎమోషన్స్ చాలా చక్కగా కుదురుతాయి. చెప్పే పాయింట్ కుడా ఒరిజినల్ గా వుంటుంది. మ్యూజిక్ మనసుని హత్తుకుంటుంది. అయితే ఇవన్నీ ఆర్గానిక్‌ మామ.. హైబ్రీడ్‌ అల్లుడు లో మిస్ అయ్యాయి. కథ మొదలైనప్పటికీ నుంచి ఎక్కడా వావ్ అనుకునే సన్నివేశం పడలేదు. హీరో కొండపల్లి బొమ్మలు అమ్మడం, హాసిని విజయ్ ల ప్రేమ కథ, పాటలు ఫైట్లు ఇవన్నీ రొటీన్ వ్యవహరంలా వుంటుంది.

విరామం తర్వాత మామ అల్లుడు కి సంబధించిన సంఘర్షణ వుంటుంది అనుకుంటే అదీ జరగలేదు. ఒక రియల్ ఎస్టేట్ ఎపిసోడ్ తెచ్చి ఒక స్కిట్ లా మార్చేశారు. అజయ్ ఘోస్ పాత్రకాసేపు నవ్వించిన అది కథని ముందుకు నడపలేకపోయింది. ముఖ్యంగా ఈ కథలో సంఘర్షణే లేదు. దీంతో అంతా కుత్రిమంగా తయరైయింది. క్లైమాక్స్ కూడా స్పీచులతో చప్పగా ఎలాంటి డ్రామా లేకుండా నడిపించేశారు.

ఎవరెలా చేశారు: సోహెల్ విజయ్ పాత్రని హుషారుగా చేశాడు. అయితే ఆ పాత్రని తీర్చిదిద్దన విధానం ఆర్గానిక్ గా లేదు. మృణాళిని రవి డీసెంట్ గా కనిపించింది. రాజేంద్ర ప్రసాద్ తన అనుభవాన్ని చూపించింది. మీనా పాత్రలో నటన తక్కువ మాటలు ఎక్కువ. సునీల్ కొన్ని నవ్వులు పంచాడు. అజయ్ ఘోస్ ఎపిసోడ్ కొంత నవ్విస్తుంది. వరుణ్ సందేశ్, రశ్మి అతిధి పాత్రల్లో కనిపించారు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. ఎస్వీకే ఇచ్చిన పాటల్లో అల్లసాని అల్లిక పాట బావుంది. కెమరా పనితనం డీసెంట్ గా వుంది. నిర్మాణ విలువలు పరిధిమేర వున్నాయి.

ప్లస్ పాయింట్స్
కొన్ని కామెడీ సీన్లు
ఓ పాట, డీసెంట్ మేకింగ్

మైనస్ పాయింట్స్
కథలో బలం లేకపోవడం
కథనంలో కొత్తదనం లేకపోవడం
సాగాదీత

ఫైనల్ పంచ్: అలరించని మామ.. ఆకట్టుకొని అల్లుడు

Exit mobile version