Site icon TeluguMirchi.com

‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ టాక్..

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కెరియర్ లో ఓ మైలురాయి చిత్రం గా నిలిచిపోయిన చిత్రం ‘ఆపరేషన్‌ దుర్యోధన’. పోసాని కృష్ణమురళి డైరెక్టర్ గా నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. 2007 లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసారు. ‘గాంధీ కడుపున గాంధీ పుట్టడు. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకురావాల్సిందే’.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో శ్రీకాంత్ సందడి చేసాడు.

శ్రీకాంత్ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఆపరేషన్ దుర్యోదన సినిమాను మళ్లీ చూపిస్తున్నట్టే ఉంది. తన కాలికి ఉన్న చెప్పు ఊడిపోతే దాన్ని తీయబోయిన పోలీస్ అధికారిని చెంప చెల్లుమనేటట్టు సీన్, పోసాని కామెడీ, దీక్షా పంత్ గ్లామర్ సినిమా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. వివిధ రూపాల్లో.. వివిధ పేర్లతో. సమ్ ఆర్ కమింగ్ అండ్ సమ్ ఆర్ గోయింగ్’ అంటూ శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచు మనోజ్ ‘ఆపరేషన్ 2019’ చిత్రానికి హైప్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్ కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

ఈ మూవీలో శ్రీకాంత్ పాటు మంచు మనోజ్, సునీల్‌లు కీలకపాత్రల్లో నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ దీక్షా పంత్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Exit mobile version