Site icon TeluguMirchi.com

Ooru Peru Bhairavakona : ఉత్కంఠను పెంచుతోన్న ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్..!


యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. ఫిబ్రవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా.. నిజమే నే చెబుతున్నా పాట మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ ట్రైలర్ ను లాంచ్ చేసారు మేకర్స్.

ఉంత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన అంటూ మరింత సస్పెన్స్ ను క్రియేట్ చేసారు మేకర్స్. డైలాగ్స్ బాగున్నాయి. ఇక సందీప్ కిషన్, వర్ష ఇద్దరు తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version