Site icon TeluguMirchi.com

Ooru Peru Bhairavakona : ‘నా వల్ల కాదే బొమ్మ..’ అంటున్న సందీప్ కిషన్ ?


ప్రామిసింగ్ యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ ఫాంటసీ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఊరు పేరు భైరవకోన’ విడుదలకు సిద్ధమవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచగా.. ఫస్ట్ సింగిల్‌ ‘నిజమే చెబుతున్న’ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. ‘ఊరు పేరు భైరవకోన’ సెకండ్ సింగిల్ హమ్మా హమ్మా ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు సెకండ్ సింగల్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసారు. ఇక ప్రోమోలో సందీప్ కిషన్ ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్ళు చూస్తే అమ్మ.. కిక్కెక్కుతోందే జన్మ.. హమ్మా హమ్మా..’ అంటూ అదరగొట్టేసాడు. ఇకపోతే కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version