Ooru Peru Bhairavakona : ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ కూడా ఆరోజే..


హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకోగా.. మొదటి రెండు పాటలు – నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇకపోతే తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. ఇక వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇదిలావుంటే, ఫిబ్రవరి 9న ఈ సినిమాతో పాటు.. రవితేజ ‘ఈగల్’, సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.