Site icon TeluguMirchi.com

Ooru Peru Bhairavakona : సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ ఫిక్స్ !


హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’ 2024లో విడుదల కానున్న క్రేజీ, మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు మేకర్స్.

‘ఊరు పేరు భైరవకోన’ ఫిబ్రవరి 9, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ రిలీజ్ డేట్ పోస్టర్ లో సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకుని కనిపించిన యాక్షన్ సీక్వెన్స్‌ చాల క్యూరియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Exit mobile version