అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాల తర్వాత నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..కానీ వారి అంచనాలు అందుకోవడం లో మూవీ విఫలం అయ్యింది. ప్రేక్షకులను మెప్పించలేక పోవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటున్నారు సినీ జనాలు..
* ముందుగా చాలా మందికి ఇది హాథీరామ్ బాబా కధ అనే తెలియదు. వెంకటేశ్వర మహత్యం లాంటి సినిమా అనుకోని సినిమాపై ఓ ఆసక్తి పెంచుకున్నారు..తీరా థియేటర్స్ కు వెళ్లేసరికి హాథీరామ్ బాబా చుట్టూ సినిమా నడవడం , ఎవరికీ తెలియని కథ కావడంతో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు..
* రెండోవది సినిమాని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడం లో చిత్ర యూనిట్ విఫలం అయ్యారు. అది కాక ఆడియో కూడా శ్రోతలను అలరించలేకపోయింది. ఒకవేళ ఆడియో బాగున్నా వాటికోసమైన సినిమాకు వెళ్లి వారు.
* అన్నమయ్య లో రోజా – మోహన్ బాబు ల ఫై ఓ రొమాంటిక్ సాంగ్ ను , శ్రీరామదాసు లో స్నేహ , నాగార్జున ల ఓ రొమాంటిక్ సాంగ్ ను పెట్టి రాఘవేంద్రరావు సక్సెస్ అయ్యాడు. అదే ఫార్మేట్ లో ఈ మూవీ లో కూడా ప్రగ్యా అనుష్కల రొమాంటిక్ సాంగ్స్ పెట్టాడు కానీ అవి బెడిసి కొట్టాయి.
ప్రధానంగా ఈ మూడు కారణాలు సినిమాను బాగా మైనస్ చేశాయని చెపుతున్నారు.