ఒంగోలు గిత్త రిలీజ్ డేట్ ఖరారు?

ram ongolgitthaరామ్, కృతి కర్బందా ప్రధాన పాత్రలలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒంగోలు గిత్త’. ఇటీవల ఆడియో వేడుక జరుపుకున్నఈ చిత్రంను పిబ్రవరి 1న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జి వి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన బాణీలు ఇప్పటికే హిట్ టాక్ సంపాదించుకున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ లోనూ రామ్ గత చిత్రాలను దాటుతోందని, చాలా ఉత్సాహంగా బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. చిత్రం గురించి దర్శకుడు బాస్కర్ మాట్లాడుతూ..‘మిర్చీ యార్డ్ నేపథ్యంలో సాగే కధ ఇది. ఇందులో రామ్ పాత్ర చిత్రణ కొత్త తరహాలో ఉంటుంది. నా గత చిత్రాల తరహాలో సున్నితమైన భావోద్వేగాలుంటూనే మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమా అవుతుందని అన్నారు. ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ పై నిర్మిస్తున్నారు.