కెరీర్ ఆరంభంలో శంకర్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పట్లో బాయ్ సినిమా కోసం నన్ను ఒక పాత్రకు గాను సంప్రదించారు. కాని అంతకు కొన్ని వారాల ముందే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో మల్లెపువ్వు అనే చిత్రంను చేసేందుకు కమిట్ అయ్యాను. శంకర్ దర్శకత్వంలో సినిమా విషయాన్ని కృష్ణవంశీకి చెప్పగా రెండిట్లో ఏది చేసుకుంటావో నీవే డిసైడ్ అవ్వు అన్నాడు. అప్పుడు తమిళ సినిమా చేయండం కంటే తెలుగు సినిమానే చేయడం బెటర్ అనుకున్నాను. శంకర్ సినిమా ప్రారంభం అయ్యి విడుదలైన తర్వాత కూడా మల్లెపువ్వు ప్రారంభం కాలేదు. దాంతో నేను చాలా పెద్ద తప్పు చేశానని అర్థం అయ్యింది.