ఆగిపోయిన సినిమా కోసం శంకర్‌ సినిమాను వదులుకున్నా

ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్‌ హీరోల జాబిత తీస్తే అందులో తప్పకుండా అడవి శేషు పేరు మొదటి వరుసలోనే ఉంటుంది. మల్టీ ట్యాలెంటెడ్‌గా పేరు దక్కించుకున్న అడవి శేషు ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవలే ‘ఎవరు’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన శేష్‌ త్వరలో కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక అడవి శేషు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ఆరంభం గురించి ఆసక్తికర విషయాలు మీడియాతో చెప్పుకొచ్చాడు.

కెరీర్‌ ఆరంభంలో శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పట్లో బాయ్‌ సినిమా కోసం నన్ను ఒక పాత్రకు గాను సంప్రదించారు. కాని అంతకు కొన్ని వారాల ముందే కృష్ణవంశీ గారి దర్శకత్వంలో మల్లెపువ్వు అనే చిత్రంను చేసేందుకు కమిట్‌ అయ్యాను. శంకర్‌ దర్శకత్వంలో సినిమా విషయాన్ని కృష్ణవంశీకి చెప్పగా రెండిట్లో ఏది చేసుకుంటావో నీవే డిసైడ్‌ అవ్వు అన్నాడు. అప్పుడు తమిళ సినిమా చేయండం కంటే తెలుగు సినిమానే చేయడం బెటర్‌ అనుకున్నాను. శంకర్‌ సినిమా ప్రారంభం అయ్యి విడుదలైన తర్వాత కూడా మల్లెపువ్వు ప్రారంభం కాలేదు. దాంతో నేను చాలా పెద్ద తప్పు చేశానని అర్థం అయ్యింది.