’ఓ మై గాడ్’.. రీమేక్!

venkiబాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ మూవీస్ లపై మససుపడుతుంటాడు మన వెంకీ. ’బాడీగార్డ్’, ’మసాలా’ సినిమాలు కూడా రిమేక్ కథలే. వసూళ్ల పరంగా ఈ రెండు కూడా నిరాశనే కలిగించాయి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ సినిమాని తెలుగులోనికి తీసుకురావడానికి వెంకీ రెడీ అయ్యారు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం ’ఓ మై గార్డ్’. అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో అక్షయ్ పాత్రలో వెంకీ నటించనున్నారు. ఇక, పరేష్ రావల్ పాత్ర ఎవరు చేస్తారన్నది కన్ ఫామ్ కాలేదు. ’తడాఖా’ దర్శకుడు డాలీ.. ఈ చిత్రానికి దర్శకత్వం  వహించనున్నారు.