Site icon TeluguMirchi.com

Om Bheem Bush : క్యాచిగా ‘ఓం భీమ్ బుష్’ ఫస్ట్ సింగిల్..


బ్రోచేవారెవరురా సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మరో సరికొత్త కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో రాబోతున్నారు. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘బ్యాంగ్ బ్రోస్..’ పాటని రిలీజ్ చేసారు మేకర్స్.

Love Me Teaser : ‘లవ్ మీ’ టీజర్.. వామ్మో దెయ్యంతో రొమాన్సా ?

సన్నీ ఎం.ఆర్ ఈ పాటని లైవ్లీ గా కంపోజ్ చేశారు. లక్ష్మీ ప్రియాంక అందించిన లిరిక్స్ చాలా క్యాచిగా వున్నాయి. ఆదిత్య అయ్యంగర్, డింకర్ కల్వల, వివేక్ హరిహరన్, రుత్విక్ తలశిల్కర్, సన్నీ M.R కలసి డిలైట్ ఫుల్ గా అలపించారు. ఈ పాటలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఎనర్జిటిక్‌గా కనిపించారు. వైబ్రెంట్ అండ్ లావిష్ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Bang Bros Lyrical Video | Om Bheem Bush | Sree Vishnu, Rahul Ramakrishna, Priyadarshi | Sunny M.R.

Exit mobile version