Site icon TeluguMirchi.com

Hi Nanna : ఎక్కడ పార్టీ జరిగిన ‘ఒడియమ్మ’ పాటే మ్రోగాలి..


నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పెద్ద మ్యూజికల్ హిట్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, ఈరోజు నాలుగో పాట ఒడియమ్మను వర్ధమాన్ కాలేజ్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో కలసి హీరో నాని వేదికపై ఒడియమ్మ పాటకు డ్యాన్స్ చేయడం కన్నులపండగలా అనిపించింది.

సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ పెప్పీ, లైవ్లీ , గ్రూవీ పార్టీ నెంబర్ గా ఈ పాటని కంపోజ్ చేశారు. ఎలక్ట్రానిక్ బీట్‌లు, ఎనర్జిటిక్ వొకల్స్ పాటని ఇన్స్టంట్ హిట్ గా మార్చాయి. ధృవ్ విక్రమ్, శృతి హాసన్, చిన్మయి శ్రీపాద అద్భుతంగా పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. దేవదాసు నుండి ఏఎన్ఆర్ మాటలు పాటలో చేర్చడం అదనపు ఆకర్షణగా నిలిచింది.

నాని, శ్రుతి హాసన్ ఇద్దరూ తమ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారు. కలర్‌ఫుల్ సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. విజువల్స్ బ్రైట్‌గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మిస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Hi Nanna: Odiyamma (Telugu Lyrical Video) Nani, Shruti Haasan | Dhruv |Shouryuv | Hesham Abdul Wahab

Exit mobile version