Site icon TeluguMirchi.com

#NTR31 అఫిషియల్ : ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్

ఈ రోజు (మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. తారక్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ దొరికింది. ఈరోజు ఉదయం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఎప్పటినుండో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలయికలో #NTR31 సినిమా ఉండనుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంచించిన ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్ #NTR31 సినిమా ప్రకటిస్తూ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కేజీఎఫ్‌ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీ గా ఉన్నాడు. కేవలం కన్నడ నిర్మాతలే కాదు మన టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సైతం ఈయన తో సినిమాలు నిర్మించేందుకు పోటీ పడుతున్నారు. కానీ ఆ ఛాన్స్ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ కు ఇచ్చాడు ప్రశాంత్.

Exit mobile version