నేడే NTR30 ఫస్ట్ లుక్..


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం NTR30. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పక్కా యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

‘అప్పుడ‌ప్పుడు ధైర్యానికి కూడా తెలియ‌దు.. అవ‌స‌రానికి మించి త‌ను ఉండ‌కూడ‌ద‌ని.. అప్పుడు భ‌యానికి తెలియాలి..త‌ను రావాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని’ అంటూ మోష‌న్ పోస్ట‌ర్‌లో డైన‌మేట్ లాంటి డైలాగ్‌లతో సినిమా ఎలా ఉండ‌బోతోందో..ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్‌ని ఏ స్థాయిలో తీర్చిదిద్దారో కొర‌టాల చిన్న హింట్ ఇచ్చారు. ఇకపోతే ఎన్టీఆర్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం రాత్రి 7:02 గంట‌ల‌కు ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కాగా అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024, ఏప్రిల్ 5న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.