’రభస’లో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు?

rabhasaఎన్టీఆర్-సంతోష్ శ్రీనివాస్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే.. ‘రభస’. బెల్లకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత. ఆగస్టు 2 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమా గురించి సంతోష్ శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. “ఎన్టీఆర్ శైలికి తగినట్టు కథ రాసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇది ‘కందిరీగ’కి సీక్వెల్ కాదు. అసలు దానికీ దీనికీ సంబంధం లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మూడు రకాలుగా ఉంటుంది. యూత్ కి ఐకాన్ లా కనిపిస్తాడు” అని చెప్పుకొచ్చారు. స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలోనూ చాలా కేర్ తీసుకొంటున్నారట. తప్పకుండా ఎన్టీఆర్ అభిమానుల్ని ఆకట్టుకొనే సినిమానే తీస్తా.. అని సంతోష్ శ్రీనివాస్ చెబుతున్నారు.