బాలీవుడ్ లో ఎన్టీఆర్ ‘వార్2’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ? ఒక్క సినిమాకే ఇంతనా..


ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మామూలుగానే ఆయన క్రేజ్ గురించి అందరికి తెలుసు. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత అది రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన హాలీవుడ్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పోస్టర్ ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌కు అపోజిట్ క్యారెక్టర్‌లో నటించనున్నాడు. ఈ సినిమాలో కనిపించేందుకు ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ అందుకోనున్నాడని టాక్. మొదటి సినిమాకే చుక్కలు చూపిస్తున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నారని సమాచారం.

ఇక ఎన్టీఆర్ రెమ్యునరేషన్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.30 కోట్లకు పై మాటే అని బాలివుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ట్రిపుల్ ఆర్ సినిమాకు 45 కోట్లు తీసుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం తెలుగులో చేస్తున్న కొరటాల శివ సినిమాకు ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.