నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ టీజర్ వచ్చేసింది. ఎన్టీఆర్ లుక్.. అతని స్టైలింగ్, స్టెప్స్ ఇవన్నీ ఎలా ఉంటాయా? అని వీర ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో కావల్సినంత ఉత్సాహం నింపింది. టీజర్లో ఉన్న ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. `ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అని పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదంటే నా అభిమానైనా కావాలి..` అన్నాడు ఎన్టీఆర్. ఈ నందమూరి వారసుడిని… చాలా మంది బుడ్డోడు అనే పిలుస్తారు. చిన్న ఎన్టీఆర్ కదా… అందుకు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం కూడా ఎన్టీఆర్ కి ఇష్టం ఉండదు. పరిశ్రమకొచ్చి ఇన్నేళ్లయినా ఎన్టీఆర్ ని జూనియర్.. జూనియర్ అని పిలవడం అతనికి ఆక్రోశం తెచ్చిపెట్టింది. అందుకే తన అసహనాన్ని ఇలా చూపించుకొన్నాడన్నమాట.