పాట‌ల పండుగ‌కు అంతా రెడీ!

ntrఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి శుభ‌వార్త‌. నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా?? అని ఎదురుచూస్తున్న రామయ్యా వ‌స్తావ‌య్యా పాట‌ల పండుగ‌ల‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈనెల 21న మారియ‌ట్ హోట‌ల్లో ఈ పాట‌ల్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ వేడుక‌లో…. రెండో టీజర్‌నీ చూపిస్తారు. ఈ టీజ‌ర్‌లో అదిరిపోయే డైలాగులు చాలా ప‌లికించార‌ట‌. అవి అభిమానుల‌ను ఉర్రూత‌లూగించేలా ఉంటాయ‌ని చిత్రబృందం న‌మ్మకంగా చెబుతోంది. ఎన్టీఆర్ – త‌మ‌న్ కాంబినేష‌న్‌లో ఇప్పటికే సూప‌ర్ హిట్ పాట‌లొచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో మాస్ ని మెస్మరైజ్ చేసే పాట‌లు రాలేదు. ఈసారి ఆ లోటు తీరేలా క‌నిపిస్తోంది.