Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ‘రభసకే’ కే ఫిక్సయ్యాడు

ntr rabhsaజూనియర్ జోరు పెంచాడు. వరుస సినిమాలతో హోరెత్తించడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారు. ఆ తరవాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తాడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ చిత్రానికి ‘రభస’ టైటిల్ ఫిక్సయింది. ఈ టైటిల్ ముందు నుంచీ అనుకొంటున్నదే. అయితే.. బెల్లంకొండ ఈ మధ్యే దీన్ని ఫిల్మ్ ఛాంబర్ లో
రిజిస్టర్ చేయించారు. నిజానికి ఈ కథ రామ్ చేయాల్సింది. ‘కందిరీగ 2’ అని కూడా అనుకొన్నారు. అయితే… అనివార్య కారణాల వల్ల చేతులు మారింది. ఎన్టీఆ శైలికి తగినట్టు కథలో మార్పులూ, చేర్పులూ చేసుకొంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version