Site icon TeluguMirchi.com

‘కిక్ ‘ కోసం అన్నకు సహాయం చేసిన తమ్ముడు…

NTR-Kick2రవితేజ నటించిన కిక్ 2 ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ అనుకున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం తో అలా పోస్ట్ పోనే అవుతూ వస్తుంది. రిలీజ్ డేట్స్ నిర్ణయించిన అనుకున్న విధంగా సినిమా బిజినెస్ కాకపోవడం, సినిమా కి ఓవర్ బడ్జెట్‌ కావడం తో చిత్ర రిలీజ్ కు ఆలస్యం అవుతూ వస్తుంది . బాహుబలి, రుద్రమదేవి, శ్రీమంతుడు లాంటి వరుస చిత్రాల భారీ రిలీజేస్ కోసమే కిక్- 2 రిలీజ్ వాయిదా వేశామని నిర్మాత కళ్యాణ్ రామ్ చెబుతున్నా..బయట మాత్రం రవితేజ మార్కెట్‌‌‌‌‌ను మించి 15 కోట్ల లోటు ఉందని, ఆ మొత్తాన్ని ఫైనాన్షియర్స్‌‌‌‌‌‌కు క్లియర్ చేయందే రిలీజ్ కాని పరిస్థితిలో కిక్- 2 ఉందని అంటున్నారు.

ఇంకా బిజినెస్ కోసం చూస్తే మొదటికే మోసం వస్తుందని, భావించిన జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కోసం 15 కోట్లకు తాను హామీ ఉంటానని ఫైనాన్షియర్స్‌‌‌కు భరోసా ఇచ్చాడని టాక్. మొత్తానికి గండం గట్టెక్కి కిక్-2 చిత్రం ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతుండడంతో రవితేజ ఫాన్స్ తెగ సంబరపడుతున్నారు.

Exit mobile version