ఎన్టీఆర్ బయోపిక్ ‘ఫస్ట్ పార్ట్ ‘ రన్ టైం ఎంతో తెలుసా…?

బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపి. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండుభాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి భాగం ‘కథానాయకుడు’ షూటింగ్ పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంది. ఓ పక్క ఈ పనులు చూసుకుంటునే మరోపక్క రెండో పార్ట్ ‘మహానాయకుడు’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు క్రిష్. ఈ నేపథ్యంలో మొదటి పార్ట్ కు సంబందించిన రన్ టైం ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

తాజాగా మొదటి పార్ట్ కు సంబందించిన ఎడిటింగ్ కట్ పూర్తి చేసిన డైరెక్టర్, మొదటి పార్ట్ ను 2.26 నిముషాల నిడివిని లాక్ చేశారట. మొదట్లో ఫస్ట్ పార్ట్ లోనే పార్టీ ప్రకటన.. అధికారం సాధించడం.. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోవడం వరకూ చూపించాలనే ఆలోచన చేశారట. కానీ రెండవ భాగంలో పూర్తిగా రాజకీయ జీవితం చూపించాలని డిసైడ్ అయ్యారు కాబట్టి.. మొదటి భాగాన్ని తెలుగు దేశం పార్టీ ప్రకటన తోనే ఆపేశారని తెలుస్తుంది.

మొదటి భాగం లో ఎన్టీఆర్ బాల్యం నుండి సినిజీవిత ప్రయాణం.. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే ఆలోచన రావడం… తెలుగు దేశం పార్టీ ఏర్పాటు ప్రకటన తో ఫస్ట్ పార్ట్ పూర్తి అవుతుంది. రెండో పార్ట్ లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రావడం , ఎన్టీఆర్ చేసిన పనుల గురించి తెలుపడం, ఆయన మరణం ఇలా ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ బయోపిక్ కు ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా, బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.