Site icon TeluguMirchi.com

లెజెండ్ లో ఎన్టీఆర్‌

balakrishna-and-ntr

మీరు చ‌దివింది క‌రెక్టే. లెజెండ్‌లో ఎన్టీఆర్ ఉన్నారు. యంగ్ టైగ‌ర్ కాదు… ఆనాటి నంద‌మూరి తార‌క రామారావు. 1992లో పార్టీ స్థాపించిన త‌ర‌వాత ఆయ‌న రాష్ట్రమంతా విస్ర్కృతంగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు. వంద‌లాంది బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఆ విజువ‌ల్స్ లెజెండ్‌ లో వాడుకొన్నారు. అయితే ఎక్క‌డా క‌నిపించ‌లేదు క‌దూ. ఇక్క‌డ కాదు. ఈ సీన్స్ ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ప్ర‌త్యేకం. మ‌న రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున‌, స‌ద‌రు స‌న్నివేశాలు తెదేపా కి అనుకూలంగా ఉన్నాయ‌న్న‌ది సెన్సార్ అభ్యంత‌రం. అందుకే ఎన్టీఆర్‌ కి సంబంధించిన విజువ‌ల్స్ ఇక్క‌డ తొల‌గించారు. వాటిని య‌ధాత‌ధంగా ఓవ‌ర్సీస్ లో ప్ర‌ద‌ర్శించారు. పార్టీకి సంబంధించిన డైలాగుల్లో ఇక్క‌డ బీప్‌లు వినిపించాయి. కానీ.. అమెరికా ప్రేక్ష‌కులు మాత్రం వాటినీ ఆస్వాదించారు. ఒక‌వేళ ఎన్నిక‌ల కోడ్ లేక‌పోతే ఆ స‌న్నివేశాలు ఇక్క‌డా చూసే వీలు ద‌క్కేది.

Exit mobile version