ఇది ఎన్టీఆర్ ఫేక్ లుక్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది. చిత్రానికి పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫిట్‌గా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన జిమ్‌లో చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫొటో చక్కర్లు కొట్టింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ వెనక్కి తిరిగి ఉన్న ఫొటో ఒకటి హల్‌చల్‌ చేసింది. అయితే ఆ ఫొటో ఫేక్‌ అని ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఫిట్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ క్లారిటీ ఇచ్చాడు ‘ఇది ఫేక్‌ ఫొటో. అయితే, ఇంత అద్భుతంగా క్రియేటివిటీ చూపించిన వారికి నిజంగా హ్యాట్సాఫ్‌. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్‌ కాదు’ అని ట్వీట్‌ చేశాడు లాయిడ్‌ స్టీవెన్స్‌.