Devara Glimpse : ‘దేవర’ షార్ట్ గ్లింప్స్.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీ అంచనాలే వున్నాయి. అందుకే ఎక్కడా రాజీపడకుండా కళ్యాణ్ రామ్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే అభిమానులకు సంక్రాంతి కానుకగా, జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

అయితే తాజాగా అదేరోజు(జనవరి 8న) సాయంత్రం 4:05 నిమిషాలకు గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు నాలుగు సెకన్ల షార్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ గ్లింప్స్ లో ఎన్టీఆర్ రక్తంతో తడిసిన ఆయుధాన్ని సముద్రంలో కడుగుతూ కనిపించారు. ఆ రక్తంతో కెరటాలు మొత్తం ఎరుపెక్కాయి. దీంతో జనవరి 8న రాబోయే గ్లింప్స్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇకపోతే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. కాగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.