యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక రాజకీయ పార్టీని ప్రవేశపెట్టాడని, త్వరలో రాజకీయాల్లో పాల్గొంటాడు అని, ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ ని ఎన్టీఆర్ స్థాపించాడని తాజాగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ పేరును రిజిస్టర్ చేయించినవారు ఎన్టీఆర్ ఈ పార్టీకి అద్యక్షుడిగా ఉండబోతున్నాడు, ఇది ఎన్టీఆర్ పార్టీ అంటూ బహిరంగంగా ఓ లేఖ రాశారు. దాంతో రహస్యంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఏంటి అని అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరైతే ఏకంగా ఎన్టీఆర్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని ఈ విషయంపై ఆరా తీశారు. ఎన్టీఆర్ ఈ రాజకీయ పార్టీ గురించి, తన రాజకీయ ప్రవేశం గురించి క్లారిటీగా చెప్పాడు. ఇలాంటి వార్తలను తాను పట్టించుకోని ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టి పారేశాడు.
ఇలాంటి పుకార్లను మీరు కూడా నమ్మొద్దు అంటూ అభిమానులకు సూచించాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందని, రాజకీయాల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని తేల్చి చెప్పాడు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే అధికారికంగా చెబుతానని, ఇలా రహస్యంగా ఇతర పార్టీల ద్వారా తన రాజకీయ ప్రవేశం ఉండదని క్లారిటీ ఇచ్చాడు. తన రాజకీయ ప్రవేశం గురించి అధికారికంగా సమాచారం వచ్చేదాకా ఏ వార్తను కూడా నమ్మొద్దు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జైలవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు.