ఎన్టీఆర్ – చరణ్ లు రచ్చ చేస్తున్నారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి రాజమౌళి రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ సినిమా తాలూకా ఆన్ సెట్ పిక్స్ బయటకొచ్చి హల్చల్ చేస్తున్నాయి. వీటి లో చరణ్ , ఎన్టీఆర్ లు కలిసి ఉన్నారు. మరో పిక్ లో ఇద్దరు ఏదో పుస్తకాలు తిరిగేస్తూ బిజీ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.

ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే..గత వారం రోజులుగా వైజాగ్ ఏజెన్సీ లో ఎన్టీఆర్ తాలూకా సన్నివేశాలు షూట్ చేస్తున్నారు రాజమౌళి. వాటి తాలూకా వీడియో , పిక్స్ బయటకు లీకై వైరల్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతి లోపే సినిమా షూటింగ్ అంత పూర్తి చేయాలనీ రాజమౌళి భావిస్తున్నాడట. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే అలాగే ఉందని అంటున్నారు. చరిత్రలో ఇంత వరకు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథాంశానికి దేశభక్తి జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో బాలీవుడ్ నటుడు అగ్రనటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు.