Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ : అభిమానులకు డబుల్ ధమాకా !

ఈ నెల(మే) 20 న జూ. ఎన్టీఆర్ తన పుట్టినరోజు చేసుకోనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కరోనా బారిన పడడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడంలేదు. అయితే ఈ పుట్టినరోజు నాడు అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు ఎన్టీఆర్.

మొదటిది #RRR చిత్రంనుండి ఎన్టీఆర్ కి సంబంధించి కొత్త పోస్టర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. రెండవది మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ కలయికలో సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. #RRR షూటింగ్ అనంతరం ఎన్టీఆర్, కొరటాల శివతో #ఎన్టీఆర్30 చేయనున్నాడు. ఈ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.

Exit mobile version