Site icon TeluguMirchi.com

ఆ పాత్ర లో చైతు కాదట..

నందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవితగాథతో ఈ మూవీ రూపుదిద్దికుంటుంది. ఇందులో భాగంగా ఈ మూవీ లో చాలామంది అగ్ర నటి నటులు నటిస్తున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. కృష్ణ పాత్రలో మహేష్ బాబు , మోహన్ బాబు అలాగే అక్కినేని నాగేశ్వర్ రావు గారి పాత్రలో ఆయన మనవడు నాగ చైతన్య నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నాగేశ్వర్ రావు పాత్రను చైతు తో కాకుండా అక్కినేని ఫ్యామిలీ లోనే మరొకరి చేత చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు.

ఇంతకుముందు చైతు సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంలో ఏఎన్ఆర్ పాత్రలో నటించారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాకోసం చైతు ని కాకుండా వేరే వారిని తీసుకోవాలని అనుకుంటున్నారట. వీరి మనసులో సుమంత్ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. మరి ఫైనల్ గా ఎవర్ని ఎంపిక చేస్తారనేది చూడాలి. ఇక మిగతా నటి నటుల విషయం లో మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ అంత పూర్తి చేసుకున్న ఈమూవీ జులై 05 నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం.

Exit mobile version