Site icon TeluguMirchi.com

పోలీస్ గా వ‌స్తాడ‌య్యా…

ntrరామ‌య్యా వ‌స్తావ‌య్యాలో ఎన్టీఆర్ ఓ కాలేజీ విద్యార్థిగా క‌నిపిస్తాడ‌ని చిత్రబృందం చెబుతోంది. అయితే ఎన్టీఆర్ పాత్రలో రెండో కోణ‌మూ ఉంద‌ట‌. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆపీస‌ర్‌గానూ క‌నిపిస్తార‌ని స‌మాచార‌మ్‌. బాద్‌షా ప‌తాక స‌న్నివేశాల్లో ఎన్టీఆర్ పోలీస్ డ్రెస్ వేశారు. రామ‌య్యాలో ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశాల్లో ఎన్టీఆర్ పోలీస్ గెట‌ప్‌లో అల‌రిస్తాడ‌ట‌. మ‌రి ఆ డ్రస్ ఎందుకు వేయాల్సివ‌చ్చిందో..?? త‌మ‌న్ అందించిన ఈ పాట‌లు ఇప్పటికే అభిమానుల‌ను అరిస్తున్నాయి. తెర‌పై ఇంకా బాగుంటాయ‌ని చిత్ర బృందం చెబుతోంది. అక్టోబ‌రు 10న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేసింది. మరి చెప్పిన స‌మ‌యానికి రామ‌య్య వ‌స్తాడో లేడో…?

Exit mobile version