ఫిల్మ్ సిటీ లో బాబాయ్ అబ్బాయ్ !

balayyaబాబాయ్ బాలయ్య , అబ్బాయ్ ఎన్టీఆర్ లు రామోజీ ఫిల్మ్ సిటీ లో సందడి చేస్తున్నారు. బాలయ్య లెజెండ్ , ఎన్టీఆర్ రభస ( వర్కింగ్ టైటిల్ ) చిత్రాల షూటింగ్ ప్రస్తుతం ఫిల్మ్ సిటీ జరుగుతోంది. దర్శకుడు బోయపాటి బాలయ్య ‘లెజెండ్’ కోసం ఓ కలర్ ఫుల్ సాంగ్ ను తెరేకేక్కించే పనిలో బీజీగా వుంటే, రభస దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నాడు. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రెండు చిత్రాలు 2014 ప్రదమార్ధంలో విడుదల కానున్నాయి. జనవరిలో ‘లెజెండ్’, ‘రభస’ ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యే అవకాశం వుంది.