Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ కూడా పెంచేశాడు!

ntr-ramayya-vasthavayya‘బాహుబ‌లి’ కోసం ప్రభాస్ గెడ్డం పెంచాడు. ‘బ‌లుపు’లోనూ ర‌వితేజ గ‌డ్డంతోనే క‌నిపిస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వీళ్ల బాట‌లోనే వెళ్తున్నాడు. ‘రామ‌య్యా వ‌స్తావ‌య్యా’ సినిమాలో ఆయ‌న గెడ్డంలో క‌నిపించ‌నున్నారు. పాత్రకు అనుగుణంగా కొన్ని స‌న్నివేశాల్లో ర‌గ్గడ్‌ గా క‌నిపించాల‌ట‌. అందుకే.. గెడ్డం పెంచేశాడు తార‌క్‌! ఈ లుక్‌ తోనే పార్లమెంట్ లోని ఎన్టీఆర్ విగ్రహావిష్కర‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ‘రామ‌య్యా వ‌స్తావయ్యా’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌. ఆగ‌ష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Exit mobile version